సీఎం కప్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
జగిత్యాలటౌన్: సీఎం కప్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను జిల్లాకేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత గురువారం ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, యోగా, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, నెట్‌బాల్, బేస్‌బాల్ పుష్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 13, 14 తేదీల్లో వివిధ క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులే సామగ్రి తెచ్చుకోవాలని సూచించారు. డీవైఎస్‌వో రవికుమార్, ఫిజికల్ డైరెక్టర్లు విశ్వప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మిరాంనాయక్, పీఈటీలు కృష్ణప్రసాద్, అశోక్, అజయ్, వెంకటలక్ష్మి, మల్లేశ్వరి, జమునారాణి, వేణు పాల్గొన్నారు.


