బావిలో దూకి మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Feb 10 2026 7:47 AM | Updated on Feb 10 2026 7:47 AM

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్‌, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

శాస్త్రవేత్తకు డాక్టరేట్‌

కరీంనగర్‌రూరల్‌: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్‌కు వ్యవసాయ విద్యలో పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న శేఖర్‌.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్‌తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement