తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ | - | Sakshi
Sakshi News home page

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ

Feb 10 2026 7:47 AM | Updated on Feb 10 2026 7:47 AM

తడారి

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ

అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు

వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు

అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం

గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్‌ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం భూస లక్ష్మణ్‌, తెలుగు సబ్జెక్టు టీచర్‌ శివకుమార్‌ పాల్గొన్నారు.

మా నాన్నను కాపాడండి

పది నెలల క్రితం కేన్సర్‌తో తల్లి మృతి

నేడు ప్రాణాపాయ స్థితిలో తండ్రి

ఆదుకోవాలని వేడుకుంటున్న కూతురు

చందుర్తి(వేములవాడ): రెక్కాడితేనే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని కొద్ది రోజులుగా విధి వెంటాడుతోంది. పది నెలల క్రితం తల్లి కేన్సర్‌తో మృతిచెందగా.. ఇప్పుడు తండ్రి గుండె సంబంధిత వ్యాధితో ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఖరీధైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబానికి అండగా నిలిచే దిక్కులేక ఆ ఇంటి పెద్దబిడ్డ తన తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన మ్యాదరి విజయ, లక్ష్మణ్‌ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు పావని(16), కుమారులు నితిన్‌(12), రిషిత్‌(10). ఈ దంపతులు ఇద్దరు కూలీ పనిచేసి జీవించేవారు. గతేడాది తల్లి విజయకు నోటి కేన్సర్‌ వచ్చింది. వ్యాధి ముదిరి 10 నెలల క్రితం మృతిచెందింది. తండ్రి అన్నీతానై పిల్లలను సాదుకుంటున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజులుగా మంచం పట్టడంతో 16 ఏళ్ల కూతురు పావని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గుండె పంపింగ్‌ సరిగ్గా లేదని.. ఇక్కడ వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేవని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది చెప్పారు. అయితే ఎలాంటి దిక్కులేని ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వాస్పత్రిలో తండ్రి మంచం పక్కన కూర్చొని ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దాతలు 95423 96066లో సంప్రదించి, ఆదుకోవాలని కోరుతుంది.

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ
1
1/1

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement