రంగస్థల నటుడు జేఎస్ కన్నుమూత
కోల్‌సిటీ(రామగుండం): గోదా వరిఖనికి చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ నటుడు, సింగరేణి మాజీ ఉద్యోగి జల్లారం సత్యనారాయణ(81) గురువారం అనారో గ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి కళా రంగాన్ని విషాదంలో ముంచింది. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగస్థల నాటకాలు, టీవీ ప్రదర్శనల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. స్థానిక కళాకారులు, పలు కళాసంఘాల బాధ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, కనకం రమణయ్య, చంద్రపాల్, మేకప్ అంజన్న, సిరిపురం శ్రీనివాస్, దయానంద్‌గాంధీ, మేజిక్ హరి, దామెర రాజేశ్ తదితరులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


