జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్ తీరు బాధాకరం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు
మెట్‌పల్లి: మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పట్ల కాంగ్రెస్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసిన జీవన్‌రెడ్డిపై ఆ పార్టీ పెద్దలు నడుచుకుంటున్న తీరు సరిగా లేదన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆయనను కోరినప్పుడు తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే బీఆర్‌ఎస్‌లో చేరి ఉంటే ఆయనకు మంత్రి పదవి దక్కేదన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల: స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఎన్నికల సిబ్బందిని అదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది, వసతులు అన్నీ ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. లోటుపాట్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. నోడల్ అధికారి మదన్‌మోహన్, కమిషనర్ స్పందన ఉన్నారు.
కాషాయ జెండా ఎగరాలి
జగిత్యాల/రాయికల్: మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాషాయ జెండా ఎగరాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల, రాయికల్‌లో పర్యటించారు. మున్సిపాలిటీలకు కేంద్రమే నిధులు విడుదల చేస్తోందన్నారు. ఆమె వెంట కొండ లక్ష్మణ్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్ తీరు బాధాకరం


