తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ధర్మపురి: పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పట్టణ ప్రజలకు కనీసం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే అక్కపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి పట్టణానికి తాగునీటి సమస్య దూరం చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


