బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టే | - | Sakshi
Sakshi News home page

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టే

Feb 8 2026 4:28 AM | Updated on Feb 8 2026 4:28 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టే

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టే

కోరుట్ల/మెట్‌పల్లి: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టేనని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శనివారం కోరుట్ల, మెట్‌పల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయనుందన్నారు. ఢిల్లీలో రాహూల్‌గాంధీ, రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి, కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కోరుట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణానికి అధిక నిధులు మంజూరు చేసి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్‌ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, యువతకు 70 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామని పేర్కొన్నారు. కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి మాట్లాడుతూ కోరుట్ల అభివృద్ధి రత్నాకర్‌ రావు హయాంలోనే జరిగిందని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో శూన్యమని పేర్కొన్నారు. కోరుట్లలో పాలిటెక్నిక్‌, వెటర్నరీ విశ్వవిద్యాలయం, 4500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని, ఐదేళ్లలో ఒక్కరేషన్‌ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని తెలిపారు.

కోరుట్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

అభివృద్ది సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

భారీ నీటిపారుదల, పౌరసఫరాల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement