శివరాత్రి వేడుకలకు రండి | - | Sakshi
Sakshi News home page

శివరాత్రి వేడుకలకు రండి

Feb 8 2026 4:28 AM | Updated on Feb 8 2026 4:28 AM

శివరా

శివరాత్రి వేడుకలకు రండి

మంత్రి అడ్లూరికి ఆహ్వానం

వెల్గటూర్‌: కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15న మహాశివరాత్రి ఉత్సవాలకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ కమిటీ చైర్మన్‌ పూదరి రమేశ్‌ శనివారం మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. శివరాత్రి రోజు నిర్వహించే పూజలు, గోదావరి పుణ్యస్నానాలకు రావాలని ఈవో కాంతారెడ్డి, అర్చకులు సంజీవ్‌ శర్మ, ఆలయ సిబ్బంది రాజయ్య తదితరులు కోరారు.

ఏప్రిల్‌ నాటికి ఆయిల్‌ పాం కోతలు

జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్‌

గొల్లపల్లి: ఆయిల్‌ పాం తోటలు ఏప్రిల్‌ నాటికి కోతకు వస్తాయని జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్‌ అన్నారు. మండలంలోని దట్నూర్‌లో సాగవుతున్న ఆయిల్‌ పాం తోటలను శనివారం జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాంప్రసాద్‌ పరిశీలించారు. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 గెలలు ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2022–23లో నాటిన తోటలు ఏప్రిల్‌, మే నెలల్లో కోతకు వస్తాయని, రైతులకు కోత విధానంపై త్వరలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. రైతులు ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మపురి ఉద్యాన అధికారి అర్చన, హెచ్‌ఈవోలు, రైతులు పాల్గొన్నారు.

చిన్నారులకు టీకాలు వేయించాలి

డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌

జగిత్యాలరూరల్‌: చిన్నారులు భవిష్యత్‌లో ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా తప్పనిసరిగా టీకాలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం హబ్సీపూర్‌లో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. పుట్టినప్పటి నుంచి ప్రతినెలా వ్యాక్సిన్లు సక్రమంగా వేయించాలన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

‘ఎఫ్‌ఎల్‌ఎస్‌’ పరీక్షకు సన్నద్ధం చేయాలి

రాయికల్‌: ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో రాము అన్నారు. మండలంలోని మైతాపూర్‌ ప్రభుత్వ పాఠశాలను శనివారం సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులకు పునాది అక్షరాస్యత, సంఖ్య జ్ఞానంపై ఆరా తీశారు. తెలుగు, ఆంగ్లం ఎంతవరకు స్పష్టంగా చదువుతున్నారో గుర్తించాలని, గణితంపై పట్టు సాధించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో రాఘవులు, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, ఉపాధ్యాయులు గుండేటి కల్పన, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ రవీందర్‌ పాల్గొన్నారు.

కోరుట్ల: పట్టణంలోని జెడ్పీ పాఠశాలలో శిక్షణ కల్పించారు. జిల్లా సెక్టోరియల్‌ అధికారి సత్యనారాయణ, ఎంఈఓ నరేశం, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

అక్రిడిటేషన్ల జారీకి దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల: అక్రిడిటేషన్‌ కార్డుల జారీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. 2026–27 సంవత్సరానికిగాను జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానించామని, అర్హత గల వర్కింగ్‌ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పౌరసంబంధాల శాఖ అధికార వెబ్‌సైట్‌ IPQ.TELANGANA.GOV.INలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 9 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

శివరాత్రి వేడుకలకు రండి1
1/3

శివరాత్రి వేడుకలకు రండి

శివరాత్రి వేడుకలకు రండి2
2/3

శివరాత్రి వేడుకలకు రండి

శివరాత్రి వేడుకలకు రండి3
3/3

శివరాత్రి వేడుకలకు రండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement