బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి కుటుంబానికీ లబ్ధి
కోరుట్లరూరల్: బీఆర్‌ఎస్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఏదోవిధంగా లబ్ధి చేకూరిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంతోపాటు మున్సిపాలిటీలో విలీనమైన యెఖీన్‌పూర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ హయాంలో డ్రైనేజీలు, రోడ్లు, వీధీదీపాలు, అవసరమైన చోట పార్కులు నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకొచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.


