అభివృద్ధే నా లక్ష్యం
జగిత్యాల: జగిత్యాల, రాయికల్ అభివృద్ధే నా లక్ష్యమని, ఇప్పటికే జగిత్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మోతెలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ యావర్‌రోడ్డు విస్తరణ అని, గురువారం గుమ్లాపూర్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్న జీవన్‌రెడ్డి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీడీఆర్ (ట్రాన్స్‌ఫర్ డెవపల్‌మెంట్ రైట్స్)లో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించినట్లు తెలిపారు. అధికార పార్టీ అండతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనులు చేయించుకునే ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకునే కౌన్సిలర్లను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీశ్, దామోదర్‌రావు, శ్రీనివాస్, సురేందర్‌రావు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఓటు వేయండి
అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ప్రచారం చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిధులు తెప్పించి ప్రతీ వార్డులో సీసీరోడ్లతో పాటు, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, గట్టు సతీశ్, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.


