పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ కాంగ్రెస్‌దే జోరు | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ కాంగ్రెస్‌దే జోరు

Feb 14 2026 8:03 AM | Updated on Feb 14 2026 8:03 AM

 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ కాంగ్రెస్‌దే జోరు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ కాంగ్రెస్‌దే జోరు

సుల్తానాబాద్‌లో రెండు ఓట్లు తిరస్కరణ

సాక్షి పెద్దపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో పోస్టల్‌ ఓట్లు సైతం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకే పడ్డాయి. రామగుండం కార్పొరేషన్‌లో 467 ఓట్లకు 220 కాంగ్రెస్‌కు, 92 బీఆర్‌ఎస్‌కు, 46 బీజేపీకి పడ్డాయి. సింహానికి 45,ీ ససీపీఐకి 2, జనసేనకు 3, స్వతంత్రులకు 31 ఓట్లు పడ్డాయి. 28 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 65 ఓట్లు పోలవ్వగా, అందులో రెండు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 63 ఓట్లలో కాంగ్రెస్‌కు 31, బీఆర్‌ఎస్‌కు 14, బీజేపీకి 07, ఏఐఎఫ్‌బీకి 7, ఇండిపెండెంట్లకు 4 ఓట్లు పడ్డాయి. పెద్దపల్లిలో మొత్తం 215 ఓట్లలో కాంగ్రెస్‌కు 133, బీఆర్‌ఎస్‌కు 34, బీజేపీకి 19, ఇతరులకు 29 ఓట్లు పడ్డాయి. మంథనిలో 49 ఓట్లకు కాంగ్రెస్‌కు 30, బీఆర్‌ఎస్‌కు 12, ఏఐఎఫ్‌బీకి 2, ఇండిపెండెంట్‌లకు 5 ఓట్లు పడ్డాయి.

నోటాకు 847..

సాక్షి పెద్దపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి మద్దతు తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దేశంలో నిర్బంధ ఓటింగ్‌ వ్యవస్థ లేదు. దీంత వివిధ కారణాలతో చాలామంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు అవుతోంది. దీంతో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబౌట్‌)ను తొలిసారిగా మున్సిపల్‌ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. దీంతో రామగుండం కార్పొరేషన్‌లో 736 మంది, మంథనిలో 34మంది, పెద్దపల్లిలో 77మంది నోటాను వినియోగించుకున్నారు. సుల్తానాబాద్‌లో ఒక్కరు కూడా నోటాహక్కు వినియోగించుకోలేదు. పెద్దపల్లిలో ఒక ఓటరు పోస్టల్‌ బ్యాలెట్‌లో నోటాకు ఓటు వేయడం గమనార్హం.

చెల్లని ఓట్లు 1,640

సాక్షి పెద్దపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. బ్యాలెట్‌ పత్రంలో సరైన విధంగా స్వస్తిక్‌ సింబల్‌ వేయకపోవడం, ఓటువేసిన వారు తప్పుగా మలచటం తదితర కారణాలతో రామగుండం కార్పొరేషన్‌లో 1,163 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పెద్దపల్లిలో 288, సుల్తానాబాద్‌లో 101, మంథనిలో 88 ఓట్లు మొత్తంగా 1,640 ఓట్లు చెల్లకుండా పోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement