నియమావళిపై కఠినంగా వ్యవహరించాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎ న్నికల్లో నియమావళిపై కఠినంగా వ్యవహరించాల ని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు పాత్ర, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠిన అమలు, పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లు, క్రిటికల్, సున్ని త ప్రాంతాల పర్యవేక్షణ, పోలింగ్‌రోజు తీసుకో వాల్సిన భద్రత చర్యలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత వంటి అంశాలపై చర్చించారు. పోలింగ్‌రోజు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో నేరా లకు పాల్పడిన, రౌడీ షీటర్లు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరిఫ్ అలీ ఖాన్, అనిల్ కుమార్, సురేష్, కరుణాకర్, రాంనరసింహారెడ్డి, రిజర్వ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


