పర్యటిస్తూ.. ఓటు అడుగుతూ.. | - | Sakshi
Sakshi News home page

పర్యటిస్తూ.. ఓటు అడుగుతూ..

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

పర్యటిస్తూ.. ఓటు అడుగుతూ..

పర్యటిస్తూ.. ఓటు అడుగుతూ..

కోరుట్ల: బీఆర్‌ఎస్‌ హయాంలో కోరుట్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటు వేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా పలువార్డుల్లో కార్నర్‌ మీటింగులు, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, యువతకు ప్రాధాన్యం ఇవే బీఆర్‌ఎస్‌ లక్ష్యాలని పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలోనే కోరుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కేసీఆర్‌ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్టు వంటి ఎన్నో పథకాలు అందించారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement