‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

‘సాక్

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

జగిత్యాలరూరల్‌: జగిత్యాలరూరల్‌ మండలం పొరండ్ల జెడ్పీ పాఠశాలకు చెందిన 56 మంది పదో తరగతి విద్యార్థులకు సోమవారం గ్రామ సర్పంచ్‌ నక్క హరీశ్‌ చేతులమీదుగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రాంమనోహర్‌రావు, ఉపసర్పంచ్‌ ముద్దం మల్లేశం, ఉపాధ్యాయులు రామకృష్ణ, రాంరెడ్డి, దత్తాత్రేయ, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, మధు పాల్గొన్నారు.

ప్రశాంత ఎన్నికలకే ఫ్లాగ్‌మార్చ్‌

జగిత్యాలక్రైం: మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకే పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల ప్రాంతం నుంచి తీన్‌ఖని చౌరస్తా, టవర్‌సర్కిల్‌ మీదుగా పాతబస్టాండ్‌ వరకు సోమవారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్ని కల నిర్వహణకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఈనెల 11న ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని పోలీంగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని, మద్యం, నగదు, ఇతర ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీఐలు కరుణాకర్‌, సుధాకర్‌, ఎస్సైలు సుప్రియ, కుమారస్వామి, సదాకర్‌, రాజు, సుధీర్‌రావు, గీత పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు స్పందన

జగిత్యాలక్రైం: పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు బాధితులు తరలివచ్చారు. వారితో ఎస్పీ అశోక్‌కుమార్‌ నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

వెల్గటూర్‌: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15న జరిగే మహా శివరా త్రికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ కమిటీ చైర్మన్‌ పూదరి రమేశ్‌ అన్నారు. జాతర ఏర్పాట్లపై అన్నిశాఖల అధి కారులతో సోమవారం సమీక్షించారు. విద్యుత్‌, శానిటైజర్‌, పోలీస్‌ శాఖ, పార్కింగ్‌, చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ పాకెట్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆలయ ఈవో కాంతారెడ్డి, స ర్పంచ్‌ కోటయ్య, తహసీల్దార్‌ ఆర్‌.శేఖర్‌, వి ద్యుత్‌ ఏఈ శ్రీనివాస్‌, ఏఎస్సై శ్రీనివాస్‌, ఆర్‌ఐ రాంరెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.

ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న తక్షిల్‌

కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న తక్షిల్‌ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న అండర్‌–19 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌లో రాణిస్తున్నాడు. తక్షిల్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వరంగల్‌లో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో ఆదిలాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 186 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు తీశా డు. ఆ మ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తక్షిల్‌ను కళాశాల ప్రిన్సిపల్‌ వేణు, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి భాస్కర్‌, అధ్యాపకులు అభినందించారు.

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌  పంపిణీ1
1/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌  పంపిణీ2
2/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌  పంపిణీ3
3/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌  పంపిణీ4
4/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement