‘ఫార్మర్ రిజిస్ట్రీ..’ స్పందన అంతంతే
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్స్ రిజిస్ట్రీని చేపట్టింది. ఈ రిజిస్ట్రీకి రైతులు పెద్దగా మొగ్గు చూపకపోవడంతో అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. కార్యక్రమం నత్తనడకన నడుస్తుండటంతో వేగవంతం చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. జిల్లాలో మే 2025న ఫార్మర్స్ రిజిస్ట్రీ ప్రారంభమైనప్పప్పటికీ రైతులు వివిధ కారణాలతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో మొత్తం రైతులు 2,46,317 మంది ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1,25,601 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రీ చేసుకున్నారు. ఇంకా 1,20,706 మంది చేయించుకోవాల్సి ఉంది. మేడిపల్లి మండలంలో 6,252 మంది రైతులకు అత్యధికంగా 4,289 మంది ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో 5,964 మంది రైతులకు కేవలం 2,069 రైతులే చేయించుకున్నారు. మిగతా మండలాల్లో 50 నుంచి 60 శాతం పూర్తయ్యింది.
ఆధార్‌నంబర్‌తో..
ఏఈవోలు ఆధార్‌నంబర్ల అధారంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ చేపడుతున్నారు. తద్వారా భూమి సర్వేనంబర్లన్నీ ఆధార్‌నంబర్‌కు అనుసంధానం అవుతాయి. రిజిస్టర్ చేసేటప్పుడు సెల్‌నంబర్‌కు రెండు, మూడుసార్లు ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ఎంటర్ చేయగానే రిజిస్ట్రీ పూర్తవుతుంది. అక్షరజ్ఞానం లేని కొంతమంది రైతులు ఆధార్‌నంబర్ ఇస్తే ఏమవుతుందో..? ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెబితే డబ్బులు పోతాయేమో..? సర్వేనంబర్లన్నీ ప్రభుత్వానికి తెలిస్తే తమకు వచ్చే పథకాలు రద్దవుతాయేమో..? అని చాలామంది వివరాలు ఇవ్వడం లేదు. కొంతమంది రైతులు చనిపోవడం, వ్యవసాయ శాఖ వద్ద పాత డేటా ఉండటంతో రిజిస్ట్రీ నత్తనడకన నడుస్తోంది. రిజిస్ట్రీ ఏఈవోలతోపాటు మీసేవా కేంద్రాల్లో కూడా చేయించుకోవచ్చు. ఏఈవోలు యాసంగి పంటల నమోదుకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
పారదర్శకంగా అందించేందుకు..
అపోహలు వద్దు
గ్రామాల్లో ఏఈవోలు చేపడుతున్న ఫార్మర్స్ రిజిస్ట్రీపై అపోహలు వద్దు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌నంబర్, ఆధార్‌నంబర్‌తో భూ రికార్డులు లింక్ అవుతాయి.
– భాస్కర్, డీఏవో
‘ఫార్మర్ రిజిస్ట్రీ..’ స్పందన అంతంతే
‘ఫార్మర్ రిజిస్ట్రీ..’ స్పందన అంతంతే


