ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ బస్సులో పర్సు మరిచిపోయిన ప్రయాణికురాలికి అందజేసి కరీంనగర్‌–2 డిపో సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. గురువారం కరీంనగర్‌ ఆర్టీసీ–2 డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వచ్చింది. ఈ బస్సులో ప్రయాణించిన కరీంనగర్‌కు చెందిన రాజేశ్వరి తన పర్సును బస్సులో మరిచిపోయింది. బస్సు డైవర్‌ ఎన్‌.సంపత్‌, కండక్టర్‌ ఎన్‌.రజిత పర్సులో 5 తులాల బంగారం గొలుసు, కొంత నగదు ఉందని గమనించి ఆమెకు అందజేశారు. డిపో మేనేజర్‌ ఎం.శ్రీనివాస్‌ సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement