పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్‌సిటీ(ఎఫ్‌సీఐ)టౌన్‌షిప్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
రోడ్డుపై పడిపోయిన బండరాయి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్‌నగర్‌కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం


