‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
ఇబ్రహీంపట్నం: ‘సాక్షి’ దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ఎంతో మేలు చేస్తుందని సర్పంచ్ కొనకంటి వెంకట్ అన్నారు. మండలంలోని వర్షకొండ జెడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ స్టడీ మెటిరియల్‌ను గురువారం పంపిణీ చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్ ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు గుర్తింపు తేవాలన్నారు. ఇన్‌చార్జీ హెచ్‌ఎం గాదె శ్రీనివాస్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాంల వద్ద భద్రత
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: ఈవీఎం గోదాంల వద్ద భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంలను గురువారం పరిశీలించారు. గోదాముల్లోని యంత్రా ల భద్రత, సీసీకెమెరాల పని తీరు, సాంకేతిక అంశాలను పరిశీలించామన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏ వో హకీం, తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు.
ఆడబిడ్డకు రూ.5 వేలు
రాయికల్: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే తన పదవీకాలమంతా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5 వేలు ఇస్తానని మండలంలోని కుర్మపల్లిలో హామీ ఇచ్చిన మ్యాకల మల్లేశ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. సర్పంచ్‌గా గెలిచాక గురువారం గ్రామంలో పుల్ల సాయి దంపతులకు ఆడబిడ్డ జన్మించగా వారికి మల్లేశ్ రూ.5 వేలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.
విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం
జగిత్యాలరూరల్: గ్రామంలోని విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని విద్యుత్ ఏడీ జవహర్‌నాయక్ అన్నారు. జగిత్యాల మండలం వంజరుపల్లిలో ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు. వినియోగదారుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను సర్పంచ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఏడీ పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఏఈ, సబ్ ఇంజినీర్, ఎస్‌ఎల్‌ఐ రాజమల్లు, లైన్‌మన్ రాజా లింగం, ఏఎల్‌ఎంలు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌కు బస్సులు నడపండి
మల్యాల: నూకపల్లి మోడల్‌స్కూ ల్ కు ఉదయం, సా యంత్రం మూడు బస్సులు నడిపించాలని కోరుతూ ప్రిన్సిపాల్ ఆదిత్య గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో కె.రాము, జగిత్యాల బస్ డిపో మేనేజర్ కల్పనకు గురువారం వినతిపత్రం అందించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నూకపల్లి మోడల్‌స్కూల్‌కు సుమారు 400మంది విద్యార్థులు వస్తుంటారని, గతంలో ఉదయం మూడు బస్సులు, సాయంత్రం మూడు బస్సులు నడిచేవని, ప్రస్తుతం ఒక్కటి మాత్రమే నడుస్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, సకాలంలో పాఠశాలకు చేరుకోలేకపోతున్నారని, అధికారులు స్పందించి, నూకపల్లి మోడల్ స్కూల్‌కు బస్సులు నడపాలని కోరారు.
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ


