బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
జగిత్యాల: కేసీఆర్ హయాంలోనే జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించి.. అభివృద్ధిలో నిలిచిందని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని పలువార్డులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలోనే జిల్లా ఏర్పడి మెడికల్ కళాశాల మంజూరైందని, ఆస్పత్రులు మెరుగయ్యాయని, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు.
అవ్వా కేసీఆర్‌ను మరువకు
అవ్వా.. కేసీఆర్‌ను మరువకు.. వృద్ధులకు పింఛ న్లు పెంచి ఇచ్చిండు.. అంటూ వసంత ఓ వృద్ధురాలిని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకేంద్రంలో పర్యటిస్తుండగా.. ఓ వృద్ధురాలు ఎదురుపడగా ఆమెను ఆప్యాయంగా పలుకరించారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత


