మున్సిపాలిటీలకు ప్రభుత్వం నయాపైసా ఇవ్వలే..
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్లరూరల్: మున్సిపాలిటీలకు రెండేళ్లకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా విడుదల చేయలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కోరుట్ల మున్సిపాలిటీలోని సపాయి కార్మి కులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నా.. ఇక్కడి కాంగ్రెస్ నాయకుడు ఆయన తండ్రి విగ్రహానికి రూ.30లక్షలను మున్సిపల్ సొమ్మును వాడుకున్నారని పరోక్షంగా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికా రంలో ఉన్నా.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తాను అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ యా వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.


