కేంద్ర నిధులతోనే బల్దియాల అభివృద్ధి
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి
రాయికల్: కేంద్ర నిధులతోనే బల్దియాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. గురువారం పట్టణంలోని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారంతో రాయికల్ బల్దియాలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ ఎలక్షన్ ఇన్‌చార్జి బానాల లక్ష్మారెడ్డి, ముత్యంరెడ్డి, రాయికల్ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, రాష్ట్ర నాయకులు పడాల తిరుపతి, సింగని సతీశ్, శ్రీగద్దె సుమన్ పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
మెట్‌పల్లిరూరల్: విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్, సురేశ్‌ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ లైట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్, సురేశ్ మెట్‌పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్‌కు సహకరించిన వినోద్, సురేశ్‌పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతిచెందగా మృతుల కుటుంబాలను గురువారం సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో మండల సర్పంచులు పరామర్శించారు. పసుపు ఏరేందుకు వెళ్లిన మహిళా కూలీలు టాక్టర్ బోల్తాపడి మృతిచెందడం బాధకరమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక్కడ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు రొండ్ల రాజేశ్వరి రాజరెడ్డి, మండల సర్పంచులు ఏలేటి వెంకట్‌రెడ్డి, ఎగ్యారపు లింబాద్రి, పోతవేని నారాయణగౌడ్, గోల్కోండ కళ రమేశ్, దప్పుల పద్మనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర నిధులతోనే బల్దియాల అభివృద్ధి
కేంద్ర నిధులతోనే బల్దియాల అభివృద్ధి


