70.10
ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’ ఓటు హక్కు వినియోగించుకున్న 1,62,433 మంది అత్యధికంగా ధర్మపురి 75.16శాతం అత్యల్పంగా మెట్‌పల్లిలో 69.21 శాతం నమోదు
పోలింగ్
చిన్నచిన్న సంఘటనలు..
జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో బీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య నినాదాల విషయమై గొడవ చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడంతో సద్దుమణిగింది. 26వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పులి రమ పోటీ చేయగా.. ఆమె కొడుకు శ్రీధర్ తనను అన్యాయం చేశారంటూ కంటతడిపెట్టారు. ఫోన్ లాక్కోవడంతోపాటు దొంగ ఓట్లు వేయిస్తున్నారని బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో వార్డులో అధికార, స్వతంత్ర అభ్యర్థుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు వచ్చి గొడవను నిలువరించారు. కోరుట్ల 27వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఆపిల్ పండ్లు పంపిణీ చేయడంతో ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెట్‌పల్లిలోని 12వ వార్డులో అంగన్‌వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తోందని అభ్యర్థులు ఆరోపించగా.. ఆమెను విధుల నుంచి తొలగించారు.
అసౌకర్యాల మధ్య..
ప్రతి పోలింగ్ కేంద్రంలో 1600 నుంచి 1800 మంది ఓటర్లు ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను దూరంగా ఏర్పాటు చేశారు. అసౌకర్యాల మధ్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని బూత్‌లలో పోలీసులు, సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులు, అంధులను తీసుకెళ్లి ఓటు వేయించారు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ప్రజలను నిలిపివేశారు.
మెట్‌పల్లిలో మందకొడిగా ప్రారంభం
మెట్‌పల్లి: బల్దియాలో ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ మందకొడిగానే సాగింది. ఒకటి, రెండుచోట్ల తప్ప ఎక్కడా ఓటర్లు క్యూలో ఉన్నట్లు కనిపించలేదు. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 46,201 మంది ఓటర్లకు 31,975 మంది మాత్రమే ఓటేశారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కేంద్రాలకు వచ్చి ఓటేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటేశారు.
కోరుట్లలో మధ్యాహ్నం నుంచి జోరుగా..
కోరుట్ల: మున్సిపాలిటీలో మధ్యాహ్నం నుంచి పోలింగ్ ఊపందుకుంది. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడా పెద్దగా సందడి లేకుండా ప్రశాంతంగా ముగిసింది. 32వ బూత్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా బూత్‌ల్లో ఇంటి నంబర్లకు అనుగుణంగా ఓట్లు లేక ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. ఒకటో వార్డుకు చెందిన ఇద్దరు మహిళలు 12 వార్డులో నమోదు కావడంలో తికమకపడ్డారు. చాలావార్డుల్లో చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండటం గమనార్హం. కొంతమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో బీఎల్‌వోలు మీసేవ కేంద్రాల్లో వెతుక్కోవాలని చెప్పడంతో ఓటేసేందుకు వచ్చిన మహిళలు నిరాశకు గురయ్యారు.
రాయికల్‌లో ప్రశాంతం
రాయికల్: మున్సిపాలిటీలోని 12 వార్డులకు 24పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. 13,084 మంది ఓటర్లకు 9,808 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా ఐదో వార్డులో 79.01 పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 11వ వార్డులో 71.23 శాతం నమోదైంది. జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మున్సి పల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఎస్సై సుధీర్‌రావు పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ధర్మపురిలో కట్టుదిట్టం
ధర్మపురి: బల్దియాలో 15 వార్డుల్లో 13,988 మంది టు. 10,549 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలు వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. పోలీస్‌శాఖ వారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.
జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నెమ్మదిగా సాగినా మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. మొత్తంగా 70.13 శాతం ఓటింగ్ నమోదైంది. 2,31,627 మంది ఓటర్లకు 1,62,433 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచాలని అధికారులు అవగాహన కల్పించినా 70శాతానికి మించలేదు. 2020 నాటి మున్సిపల్ ఎన్నికల్లో 72.09 శాతం నమోదుకాగా.. ఈసారి కాస్త తగ్గింది. ఈసారి మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలామంది యువత ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు పెద్దగా ఆసక్తి చూపలేదు. కలెక్టర్ సత్యప్రసాద్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
శాతం
బల్దియా వార్డులు కేంద్రాలు ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు పోలైన ఓట్లు శాతం ధర్మపురి 15 29 14,035 6,722 7310 3 10549 75.16 జగిత్యాల 50 149 94,800 46,039 48742 19 65985 69.60 కోరుట్ల 33 106 63,507 30,604 32901 2 44116 69.47 మెట్‌పల్లి 26 75 46,201 22,283 23917 1 31975 69.21 రాయికల్ 12 24 13,084 6,157 6927 0 9808 74.96 మొత్తం 136 379 2,31,627 1,11,805 1,19,797 25 162433 70.13
70.10
70.10
70.10
70.10
70.10
70.10
70.10
70.10
70.10


