మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

Mar 9 2026 7:31 AM | Updated on Mar 9 2026 7:31 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

వెల్గటూర్‌(ధర్మపురి): మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన మహిళా శక్తి సంఘ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంఘాల ద్వారా బస్సులను నడిపించడం, పెట్రోల్‌ బంక్‌లు, వ్యాపారరంగంలో ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను చేపట్టి, స్వయం ఉపాధి అవకాశాలు చూపించి సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ లత, డీఆర్డీవో రఘువరణ్‌, సర్పంచ్‌ సంగ రమేశ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement