శత లక్ష్యం.. జాప్యం | - | Sakshi
Sakshi News home page

శత లక్ష్యం.. జాప్యం

Mar 9 2026 7:31 AM | Updated on Mar 9 2026 7:31 AM

● ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించడం లేదు. గతంలో ఆటోల ద్వారా అన్నీ వార్డుల్లో ప్రచారం చేసేవారు. ● సిబ్బందికి ఇంటింటికీ వెళ్లి ఆస్తిపన్ను కట్టాలని ఒత్తిడి తెచ్చేవారు. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ● డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు ఏకంగా ఆస్తిపన్ను కట్టని వారి ఇంటి ముందు ధరువు వేయించేవారు. దీంతో పాటు జరిమానా విధించేవారు. ● ప్రస్తుతం ఆస్తిపన్ను కట్టని వారు ‘పెద్దవారే’ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంటాయి. ● వీరు ఆస్తిపన్ను చెల్లిస్తే మున్సిపాలిటీలకు ఆదాయం రావడంతో పాటు, అభివృద్ధి సైతం చెందుతాయి. ● బకాయిపడిన మొత్తం చెల్లించాలని వారికి రెడ్‌ నోటీసులు ఇస్తున్నారు. ● గడువు లోపు చెల్లించకుంటే ఆ తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ● పన్నుల ద్వారా సమకూరే ఆదాయాన్ని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాల చెల్లింపుతో పాటు మౌలిక వసతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించడానికి అవకాశముంటుంది. ● దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏటా మున్సిపాలిటీలు పూర్తిస్థాయిలో పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటుంది.

జగిత్యాల/మెట్‌పల్లి: జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడ్డాయి. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. కానీ, ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాలేదు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా వసూళ్లలో జగిత్యాల చాలా వెనుకంజలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 23 రోజులు ఉన్నాయి. కాగా, మున్సిపల్‌ ఎన్నికలు వసూళ్లపై తీవ్ర పభావం చూపాయని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది అంతా ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో సుమారు నెలన్నర పాటు పన్ను వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రచారం కరువు

మొండి బకాయిదారులకు నోటీసులు

వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యానికి అడ్డుగా ఉన్న మొండి బకాయిదారులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకంజ

దగ్గరపడుతున్న ఆర్థిక సంవత్సరం

వసూళ్లపై మున్సిపల్‌ ఎన్నికల ప్రభావం

లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారుల ప్రయత్నాలు

జిల్లాలో వసూళ్లు ఇలా.. (రూ.కోట్లలో)

మున్సిపాలిటీ మొత్తం ఇళ్లు లక్ష్యం వసూలైంది

జగిత్యాల 27,877 14.03 5.59

కోరుట్ల 19,714 5.70 4.78

మెట్‌పల్లి 13,823 4.78 3.32

ధర్మపురి 4,849 1.87 56.59(లక్షలు)

రాయికల్‌ 5,527 1.34 88.47(లక్షలు)

మొత్తం 71,790 27.72 15.13

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement