భక్తిరథం | - | Sakshi
Sakshi News home page

భక్తిరథం

Mar 9 2026 7:31 AM | Updated on Mar 9 2026 7:31 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026

ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఆదివారం సాయంత్రం మువ్వురు స్వాముల రథోత్సవ వేడుకలను కన్నులపండువగా జరిపించారు. లక్ష్మీనృసింహునితో పాటు శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వరస్వాములను ఆలయం ఎదుట రథాలపై ఆసీనులు చేయగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి నంది కూడలి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. తర్వాత ఉత్సవమూర్తులను గోదావరినదికి తీసుకెళ్లి చక్రస్నానం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్వామివారలను దర్శించుకున్నారు. పది రోజుల నుంచి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరిగిందని, రానున్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌, చైర్మన్‌ జక్కు రవీందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – ధర్మపురి

Advertisement
 
Advertisement
Advertisement