జగిత్యాలఅగ్రికల్చర్: ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్‌మ్యాన్డ్ వర్కర్లను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని కార్మికులు విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఎస్‌పీడీసీఎల్ సంస్థ అన్‌మ్యాన్‌డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించిందని, ఎన్‌పీడీసీసీఎల్ మాత్రం గుర్తించడం లేదన్నారు. ప్రాణాలకు తెగించి, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్మికులను సంస్థలో విలీనం చేయాలన్నారు. ఎస్‌ఈ సుదర్శనంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు తిరుపతి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, వెంకటరమణ, రాజు, శ్రీధర్, వెంకటేషం, శ్రీకాంత్, రాజేషం, గంగాధర్ పాల్గొన్నారు.
మెట్‌పల్లి ఆర్డీవోగా నర్సింహారావు
మెట్‌పల్లి: మెట్‌పల్లి రెవెన్యూ డివి జనల్ అధికారిగా నర్సింహారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన శ్రీనివాస్‌ను ఖమ్మంకు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న నర్సింహారావును ఇక్కడకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న ఆయన కలెక్టర్ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


