కుంటుపడుతున్న బల్దియా అభివృద్ధి అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి పట్టని ప్రజాప్రతినిధులు, అధికారులు భర్తీ కోసం మున్సిపల్ డైరెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల: జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లకోమారు ప్రజాప్రతినిధులు, బదిలీపై అధికారులు మారుతున్నా.. పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా బల్దియా అభివృద్ధి కుంటుపడుతోంది. ఖాళీ పోస్టుల ప్రభావం ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రభావం చూపుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
భర్తీకి ప్రతిపాదనలు
బల్దియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేసే లా చూడాలని కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి జగిత్యా ల మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో నియమించి అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటిలో కీలకమైన పోస్టులు ఖా ళీగా ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదని భావించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ డైరెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాకేంద్రంలో శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో పర్యవేక్షించేవారు కరువై రోడ్లన్నీ డంపింగ్‌యార్డులుగా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలను వారంలో ఒకసారి కూడా తీయడం లేదు. మురికి కాలువలన్నీ సిల్ట్‌తో నిండి నీరంతా బయటకు వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించి ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
శానిటేషన్ అస్తవ్యస్తం


