అభివృద్ధి పనులపై అడిషనల్‌ కలెక్టర్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులపై అడిషనల్‌ కలెక్టర్‌ సమీక్ష

Mar 5 2026 7:38 AM | Updated on Mar 5 2026 7:38 AM

● ఎస్పీ అశోక్‌ కుమార్‌

బుగ్గారం: మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిపై అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి బుధవారం సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వసతులు తెలుసుకున్నారు. జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను పరిశీలించి పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సర్పంచ్‌ నక్క రాజవ్వ, ఎంపీడీవో సుమం, ఎంఈవో వెంకటేశ్వర్లు, ఎంపీవో వాసవి పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

జగిత్యాల: ఇంటర్‌ పరీక్షలు ఆరోరోజు ప్రశాంతంగా జరిగాయి. జనరల్‌ కోర్సులో 6,080 మందికి 5,976 మంది, ఒకేషనల్‌లో 845 మందికి 807 మంది హాజరయ్యారు. పలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ లత పరిశీలించారు. ఆమె వెంట డీఐఈవో నారాయణ, తహసీల్దార్‌ ఉన్నారు.

కొండగట్టు ఆలయ ఇన్‌చార్జి ఈవోగా రమాదేవి

మల్యాల: మండలంలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఇన్‌చార్జి ఈవోగా రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె వేములవాడ ఆలయ ఈవోగా కొనసాగుతున్నారు. రమాదేవిని అర్చకులు, ఆలయ సిబ్బంది సన్మానించారు.

క్షతగాత్రులను కాపాడితే రూ.25 వేలు ప్రోత్సాహకం

ేజగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి కి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడిన వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ.25 వేలు, ప్రశంసపత్రం అందించనున్నట్లు ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏటా వేల సంఖ్యలో రో డ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమా దం జరిగిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌గా పరిగణిస్తారని, బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నా రు. కొంతమంది పోలీస్‌ కేసు అవుతాయనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని, ఆ భయాలను తొలగించేందుకు కేంద్రం రహ్‌వీర్‌ పథకం అమలు చేస్తోందని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంట నే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేలు అందించడంతోపాటు, ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులూ ఉండవన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడేందుకు భాగస్వామి కావాలని ఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement