గోదావరి పుష్కరఘాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరఘాట్ల పరిశీలన

Mar 5 2026 7:38 AM | Updated on Mar 5 2026 7:38 AM

మల్లాపూర్‌: మండలంలోని గోదావరి తీరప్రాంతా లైన మొగిలిపేట, ఒబులాపూర్‌, కొత్తదాంరాజుపల్లి, పాతదాంరాజుపల్లి, వాల్గొండ, వీవీరావుపేట గ్రామాల్లోని పుష్కర ఘాట్లను మెట్‌పల్లి డీఎస్పీ రాములు బుధవారం పరిశీలించారు. వాల్గొండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా తీసుకోవా ల్సిన చర్యలను పరిశీలించారు. స్టాళ్లు, తాగునీ రు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్‌ ఇతర ఏర్పాట్లపై ఆరాతీశారు. ఘాట్ల వద్ద మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా చూస్తామని, బారీకేడ్లు, సీసీ కెమెరాలు, లైటింగ్‌, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నిర్వహణ, మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీకాంత్‌, ఎంపీవో జగదీశ్‌, సర్పంచ్‌లు గోల్కోండ కళ, తోట మాధూరి, ఎగ్యారపు లింబా ద్రి, రొండ్ల రాజేశ్వరి, తోపారపు వసంత, ధరంసోత్‌ సురేష్‌, కనుముల వెంకటేశ్‌, ఎస్సై అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement