నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటలో బొడ్డు మౌనిక, సురేశ్ నిర్మించుకున్న ఇంటిని శనివారం ప్రారంభించారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు దామోదర్, బొడ్డు రత్నాకర్, పొన్నాల మధుసూదన్‌రెడ్డి, రంజిత్ పాల్గొన్నారు.
వృద్ధుల సంక్షేమానికి చర్యలు
జగిత్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ సహకారంతో రూ.కోటితో టీఆర్‌నగర్‌లో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచితంగా అల్పాహారం, వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. వృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు.
కౌన్సిలర్లు అభివృద్ధికి పాటుపడాలి
కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాలలోని 2, 3, 25, 32వార్డుల కౌన్సిలర్లు చంద్రకళ, ప్రదీప్, రాజశేఖర్, బుడుగ పద్మ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.


