ఎరువులు అధికంగా వాడొద్దు
మేడిపల్లి: పంటలకు మోతాదును మించి ఎరువులు వాడొద్దని డీఏవో భాస్కర్ అన్నారు. అ గ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని రైతువేదికలో రైతులకు ఎరువుల యాజమాన్యం, వాడకంపై అవగాహన కల్పించారు. యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఆశిస్తాయని, దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. ఏవో ఎండీ.షాహిద్ అలీ, ఏఈవోలు మంజుల, స్రవంతి, ఉపసర్పంచ్ అర్జున్, రైతులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనృసింహునికి జీవన్‌రెడ్డి పూజలు
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం చల్‌గల్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ జున్ను రాజేందర్, నాయకులు సత్తన్న, రాధాకిషన్‌రావు, మాజీ ఎంపీపీ ధర రమేశ్‌బాబు పాల్గొన్నారు.
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు వరం
మెట్‌పల్లిరూరల్: ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెట్‌పల్లి ఎంఈవో చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని వెల్లుల, సత్తక్కపల్లి, రాజేశ్వర్‌రావుపేట, మేడిపల్లి, బండలింగాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు శ్రీసాక్షి శ్రీ రూపొందించిన గణితం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్‌ను శనివారం పంపిణీ చేశారు. స్టడీ మెటీరియల్ చాలా బాగుందని కితాబునిచ్చారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొగిలిపేటలో మాతృభాష దినోత్సవం
మల్లాపూర్: మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం మాతృభాష దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులతో తెలుగు పద్యాలు, పాటలు, పొడుపుకథలు, గేయాలు పాడించారు. క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెచ్‌ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేత
జగిత్యాల: మెట్‌పల్లి మండలం వెంకట్రావ్‌పేట గ్రామంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజినీర్ జానకి తెలిపారు. ఈనెల 23 నుంచి 25 వరకు కోరుట్ల, జగిత్యాలతోపాటు ధర్మపురిలోని వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాలను మినహాయించి మిగతా ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.
ఎరువులు అధికంగా వాడొద్దు
ఎరువులు అధికంగా వాడొద్దు


