‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల: వచ్చేనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్ అనుమతి ఇవ్వొద్దని, గుర్తింపు కార్డులు వేసుకునేలా చూడాలని, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, బెంచీల సౌకర్యం కల్పించాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ అప్రమత్తంగా పనిచేయాలన్నారు. పరీక్షల విభాగం డైరెక్టర్ నరేందర్ మాట్లాడుతూ నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లాస్థాయిలో ఎస్‌హెచ్‌వీఆర్‌లో ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించిన ఉపాధ్యాయులను అభినందించారు. డీఈవో రాము పాల్గొన్నారు.
సాండ్ బజార్‌లో ఇసుక కొనాలి
జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సాండ్‌బజార్‌లోనే ఇసుక కొనాలని కలెక్టర్ అన్నారు. కథలాపూర్ మండలం సిరికొండ, తక్కళ్లపల్లి, మెట్‌పల్లిలోని ఆత్మకూర్, కోరుట్ల మండలం పైడిమడుగు, మల్లాపూర్ మండలం సాతారం, వీవీరావుపేట, రాయికల్ మండలం ఇటిక్యాల, జగన్నాథపూర్‌లోని సాండ్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు సాధ్యంకావడం లేదని, ఈ క్రమంలో సాండ్‌బజార్ నుంచే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి టన్నుకు రూ.900 ఉంటుందన్నారు.


