నిత్య జనగణమనతో దేశభక్తి, జాతీయభావం | - | Sakshi
Sakshi News home page

నిత్య జనగణమనతో దేశభక్తి, జాతీయభావం

Mar 8 2026 7:51 AM | Updated on Mar 8 2026 7:51 AM

● ఎమ్మెల్యే డా సంజయ్‌కుమార్‌

జగిత్యాలటౌన్‌: నిత్య జనగణమనతో ప్రజల్లో జాతీయభావం, దేశభక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం జగిత్యాల క్లాక్‌ టవర్‌ వద్ద నిర్వహించిన నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఊటూరి గంగారాంసరోజనల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన వాటర్‌కూలర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ భావం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన నిత్య జనగణమన మిత్రబృందం ప్రతినిధులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో నేను నా దేశం అనే భావం పెంపొందుతుందన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, నాయకులు గోలి శ్రీనివాస్‌, మల్లికార్జున్‌, డిష్‌ జగన్‌, కొలగాని సత్యం, రేపల్లె హరికృష్ణ, బొడ్ల జగదీశ్‌, జ్ఞానేశ్వర్‌, నిత్య జన గణ మిత్ర బృందం సభ్యులు ఉత్తూరి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement