సేవాలాల్‌ బోధనలు మార్గదర్శకం | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ బోధనలు మార్గదర్శకం

Feb 21 2026 7:35 AM | Updated on Feb 21 2026 7:35 AM

సేవాలాల్‌ బోధనలు మార్గదర్శకం

సేవాలాల్‌ బోధనలు మార్గదర్శకం

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: సంత్‌ శ్రీసేవాలాల్‌ మహరాజ్‌ బోధనలు సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సేవాలాల్‌ జయంతి సందర్భంగా శుక్రవా రం కలెక్టరేట్‌లో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సేవాలాల్‌ మహరాజ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చెడు అలవాట్లను విస్మరించి మంచి అలవా ట్లు అలవర్చుకోవాలని, ఉన్నతమైన జీవన విధానా న్ని పెంపొందించుకునేందుకు సంస్కృతి, సంప్రదా యాలను కొనసాగించాలన్నారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రాజ్‌కుమార్‌, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అవార్డు కాపీలు త్వరగా అందించాలి

జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా అందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు వెనువెంటనే పరిష్కరించాలని, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంచకూడదన్నారు. ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా రూపొందించాలన్నారు. ప్రతి ఓటరు మ్యాప్‌ అయ్యేలా ప్రతి ఇంటి నుంచి కచ్చితమైన వివరాలు సేకరించాలని, అన్నిస్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌ వరందన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement