న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Feb 21 2026 7:35 AM | Updated on Feb 21 2026 7:35 AM

న్యూస

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌

పట్టుదలతో చదవాలి

జగిత్యాలరూరల్‌: విద్యార్థులు పట్టుదలతో చదవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాము అన్నారు. శుక్రవారం బీర్‌పూర్‌ మండలం తుంగూర్‌, బీర్‌పూర్‌ జెడ్పీ స్కూల్‌లో జరిగిన ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్‌ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈనెలలో నిర్వహించే ఎఫ్‌ఎల్‌ఎస్‌ జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తమ ర్యాంక్‌ సాధించేలా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో శిక్షణ అందించాలన్నారు. అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. వసతుల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, ఎంఈవో నాగభూషణం, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల: 2026–27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్‌ అవెలబుల్‌ స్కూల్‌ ఎంపిక కోసం జిల్లాలోని ప్రైవేటు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంక్షేమాధికారి రాజ్‌కుమార్‌ తెలిపారు. బెస్ట్‌ అవెలబుల్‌ స్కూల్‌ పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యూషన్‌, హాస్టల్‌ వసతి, భోజన సౌకర్యం కల్పించాల్సి ఉంటుందన్నారు. ప్రతీ వి ద్యార్థికి రూ.42 వేల చొప్పున చెల్లించబడుతుందని, దరఖాస్తులను ఈనెల 25లోపు సమీకృత కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

బాల్క సుమన్‌ అరెస్టును ఖండిస్తున్నాం

జగిత్యాల: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించి స్పష్టమైన తీర్పు ఇచ్చినా, మంత్రి వివేక్‌ అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం కాంగ్రెస్‌ నేతల కనుసన్నల్లో పనిచేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, తప్పుడు కేసులు పెట్టి సుమన్‌ను అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అగ్నివీర్‌ ఉద్యోగాలపై అవగాహన ఉండాలి

జగిత్యాల: అగ్నివీర్‌ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ అన్నారు. శుక్రవారం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నివీర్‌, వాయుసేన నియామకాలపై అవగాహన కల్పించారు. డిఫెన్స్‌ రంగంలో పరీక్ష విధానం, అర్హతల గురించి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ శ్రీపాద నరేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌1
1/3

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌2
2/3

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌3
3/3

న్యూస్‌రీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement