సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

Feb 21 2026 7:35 AM | Updated on Feb 21 2026 7:35 AM

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

● విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌(వేములవాడ): సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. తాండ్య్రాల గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించే మూడు మహిళ సంఘాల భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి స్వరాజ్య స్థాపనకు పాపన్న చేసిన ప్రయత్నాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, మహిళ సంఘాల సభ్యులు వ్యాపార రంగాల్లో రాణించేలా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, సర్పంచులు గుంటుక మనోహర్‌, జంగ శివాని, ఉప సర్పంచులు జనార్ధన్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement