జత కోసమా..జాగ కోసమా..! | - | Sakshi
Sakshi News home page

జత కోసమా..జాగ కోసమా..!

Feb 23 2026 7:37 AM | Updated on Feb 23 2026 7:37 AM

జత కోసమా..జాగ కోసమా..!

జత కోసమా..జాగ కోసమా..!

కోరుట్ల: నాలుగేళ్ల జే–1 టైగర్‌ 15 రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా అడవుల్లో తల్లి నుంచి విడిపోయి అడవిలో సంచారం మొదలెట్టింది. పగటిపూట కొండలు, గుట్టల్లో దాక్కుని.. రాత్రివేళ గ్రామీణ ప్రాంతాల సమీపంలో ఉన్న అడవుల నుంచి సంచరిస్తోంది. వారంక్రితం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పరిసర ప్రాంతాల అటవీ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడక్కడా పశువులపై దాడులు చేసి చంపుతూ ప్రస్తుతం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోతుకురావుపేట సమీప అడవులకు చేరుకుంది. ఆదివారం ఉదయం మోతుకురావుపేట సమీపంలో ఓ చిన్నకుంట వద్ద పెద్దపులి పాదముద్రలు ఓ రైతుకు కనిపించాయి. ఈ విషయాన్ని అటవీ అఽధికారుల దృష్టికి తీసుకురాగా.. వారు గాలింపులు చేపట్టారు.

జత కోసమేనా..

జే–1 టైగర్‌ సిద్దిపేట పరిసరాలతోపాటు అడవుల్లో జత కోసం సంచరిస్తోందా..? లేక అనువైన ప్రదేశంలో నివాసముండటానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తుందా..? అన్న విషయంలో స్పష్టత రాలేదు. అనువైన ప్రాంతాల ఎంపిక కోసం పెద్దపులులు ఆయా ప్రాంతాలకు ఒకటికి రెండుసార్లు వచ్చిపోవడం ఆనవాయితీ. మేడిపల్లి మండలం మోతుకురావుపేట వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ మల విసర్జన ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. గతేడాది ఇదే సమయంలో కొడిమ్యాల మండలం కొండాపూర్‌ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. ప్రస్తుతం కొడిమ్యాలకు దగ్గరలోనే మేడిపల్లి– మోత్కురావుపేట–గోవిందారం అటవీ ప్రాంతం ఉండటంతో మరోసారి ఈ ప్రాంతంలో సంచరించడం గమనార్హం.

ప్రత్యేక బృందాలతో గాలింపు

మేడిపల్లి మండలం మోత్కురావుపేట వద్ద కనిపించిన పెద్దపులిని పట్టుకోవడానికి మహారాష్ట్రలోని పుణే నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. మోతుకురావుపేట–చందుర్తి వైపు ఉన్న అటవీ ప్రాంతం, కొడిమ్యాల–సూరారం వైపు ఉన్న మరో అడవితో పాటు కొండగట్టు సమీపంలోని అటవీ ప్రాంతాల్లోనూ గాలింపుల కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని రైతులను, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.

పెద్దపులి సంచారంతో హడలుతున్న జనం

యాదాద్రి నుంచి మోత్కురావుపేటకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement