జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
కోరుట్ల: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వాసవీ కల్యాణ భవనంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా లారీ, కారు, డీసీఎం, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వాహన చోదకులు ప్రతీ మూడునెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అలాగే డ్రైవింగ్ మధ్యలో విశ్రాంతి కూడా అవసరమని, కంటిన్యూ డ్రైవింగ్‌తో అలసిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 210 మంది డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొమ్ముల జీవన్‌రెడ్డి, సెక్రటరీ లక్ష్మారెడ్డి, వైద్యులు సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


