నిరుపయోగంగా ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌

Mar 7 2026 7:30 AM | Updated on Mar 7 2026 7:30 AM

● దాదాపు రూ.5కోట్లతో ఏర్పాటు ● శివారు ప్రాంతాల్లో మానవ వ్యర్థాల పారబోత

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని డంపింగ్‌యార్డులో ఏ ర్పాటు చేసిన ఫికల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎఫ్‌ఎస్‌టీపీ) నిరుపయోగంగా మారింది. దాదా పు రూ.5 కోట్లతో ఎఫ్‌ఎస్‌టీపీ నెలకొల్పారు. బల్దియాలోని గృహాల నుంచి మానవ వ్యర్థాలను ట్యాంకుల ద్వారా తీసుకువచ్చి ఇందులో పోసి ఎరువులు తయారుచేస్తుంటారు. కాగా, డంపింగ్‌ యా ర్డు పట్టణానికి దూరంగా ఉండడంతో వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్లే కొందరు నిర్వాహకులు శివారు ప్రాంతాల్లో వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సమీపంలోని నివాస గృహాలవారికి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. ఈ అంశంపై అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బహిరంగ ప్రదేశాల్లో డంప్‌..

నివాస గృహాల్లోని సెప్టిక్‌ ట్యాంకుల నుంచి వ్యర్థాలను మున్సిపాలిటీల ద్వారా లైసెన్స్‌ పొందిన స్లడ్జింగ్‌ ఆపరేటర్లు నేరుగా ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌కు తరలిస్తారు. అక్కడ దానిని ఎరువుగా తయారుచేసి మున్సిపాలిటీలోని మొక్కలకు ఉపయోగించడంతో పాటు, రైతులకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొందరు ప్రైవేటు ఆపరేటర్లు వ్యర్థాలను సేకరించి బహిరంగ ప్రదేశాల్లో డంప్‌ చేయడంతో వాతావరణం కలుషితం అవుతోంది. జగిత్యాల బల్దియాలో ఐదుగు రు లైసెన్స్‌ ఆపరేటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవంగా సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి వ్యర్థాలను లైసెన్స్‌డ్‌ ఆపరేటర్లే సేకరించాలి. ఇతరులు సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో పోయడం నిషేధం.

ప్లాంట్‌ ఉన్నట్టా.. లేనట్టా..

జిల్లా కేంద్రంలోని ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌ నిరుపయోగంగా మారింది. నెలలో ఒకసారి మాత్రమే మానవ వ్యర్థాలను ఎరువుగా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు సపదించి పూర్తిస్థాయిలో ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌ రన్‌ అవుతుంది. కొంత మేర ఇబ్బందులున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ శివారుల్లో మానవ వ్యర్థాలను పోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – స్పందన,

మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement