పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత

Mar 7 2026 7:30 AM | Updated on Mar 7 2026 7:30 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ప్ర జాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పనులు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింద ని, అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నా రు. కార్యాచరణలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. వార్డుల్లో డ్రెయినేజీలు, నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు కూడా అధికారులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్రత్యేకంగా పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడం, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించడం, కార్యాలయాల పరిశుభ్రత, పన్ను వసూళ్లు, ఫైల్స్‌ క్లియరెన్స్‌, నిరంతరం తాగునీటి సరఫరా చేసేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, లత, కమిషనర్‌ స్పందన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement