వైభవంగా ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మీనృసింహుని ఉత్తర దిగ్యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఉసిరిక వాగు వద్దకు స్వామివార్లను అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామివారలను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారల కల్యాణం అనంతరం దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలుగా బయలుదేరుతుంటారని పండితులు తెలిపారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – ధర్మపురి
కమనీయం.. కల్యాణం


