నేషనల్‌ అవార్డుకు నర్సింహునిపేట నామినేట్‌ | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ అవార్డుకు నర్సింహునిపేట నామినేట్‌

Mar 7 2026 7:30 AM | Updated on Mar 7 2026 7:30 AM

● ముస్తాబవుతున్న గ్రామం

● ముస్తాబవుతున్న గ్రామం

పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నర్సింహునిపేట గ్రామ పంచాయతీని అధికారులు నేషనల్‌ అవార్డుకు నామినేటెడ్‌ చేయడంతో గ్రామం కొత్త శోభ సంచరించుకుంటుంది. గార్మంలో 718 జనాభా, 563 మంది ఓటర్లు, సుమారు 207 కుటుంబాలు, 19 మహిళా సంఘాలున్నాయి. ‘దీన్‌ దయాళ్‌ ఉపాద్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌’లో భాగంగా పేదరిక నిర్మూలన గ్రామం కింద జాతీయస్థాయి అవార్డు ఎంపిక కోసం నామినేట్‌ చేశారు. దీంతో గ్రామస్తుల సహకారంతో వారం రోజులుగా మండలస్థాయి అధికారులు, సర్పంచ్‌ సంది రాజమణి, పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీ భవనానికి రంగులు వేసి, కార్యాలయం చుట్టూ మొక్కలు నాటారు. కేంద్ర బృందం సభ్యులు గ్రామాన్ని సందర్శించి వారిచ్చిన మార్కుల ఆధారంగా అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని ఎంపీవో శశికుమార్‌రెడ్డి తెలిపారు. ఈ గ్రామం అవార్డుకు ఎంపికై తే ప్రైజ్‌ మనీ కింద మొదటి బహమతి రూ.కోటి, రెండో బహుమతి రూ.50 లక్షలు, 3వ బహుమతిగా రూ.25 లక్షలు అందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement