నారీశక్తి..
ఆమెకు భయం ఎక్కువే.. కానీ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఆమెకు బాధా ఎక్కువే.. కానీ.. అన్ని బాధ్యతలు మోస్తుంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ.. ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా.. ఏ రంగాన్ని ఎంచుకున్నా అగ్రపథాన నిలుస్తున్నారు. ఆనాడు అక్షరాలు అంటే తెలియని మహిళలు నేడు డిజిటల్ మార్కెటింగ్‌లో రికార్డు సృష్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, పిల్లలను ఉన్నతంగా చవిదించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసు అంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ రంగంలో ఉత్సాహంగా రాణిస్తున్నారు. ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు. బీడీలు చుట్టిన చేతులు పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నాయి. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో వినిపించిన గొంతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. పలువురు మహిళలు ఉమ్మడిగా ఏర్పడి ప్రారంభించిన హోంఫుడ్స్ ఖండాంతరాల్లో రుచులు పంచుతున్నాయి. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆదర్శ మహిళలపై ప్రత్యేక కథనం..!!
మహిళల భద్రతకు పెద్దపీట
విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అతివల ప్రతిభ
కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను
తీర్చిదిద్దుతున్న వైనం
ఖాకీ చొక్కా వేసుకుని బాధితులకు
సత్వర న్యాయం
పల్లెపాటల గొంతుకు ప్రపంచ గుర్తింపు
అమ్మచేతి వంటకు విదేశాల్లో అభిమానులు
ఆదర్శం.. ఉమ్మడి జిల్లాలోని పలువురు అబలలు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం


