రేబిస్‌ భయం.. | - | Sakshi
Sakshi News home page

రేబిస్‌ భయం..

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

రేబిస్‌ భయం..

రేబిస్‌ భయం..

● వేంపేటలో గేదెను కరిచిన కుక్క ● కొద్ది రోజుల తర్వాత పశువుకు వ్యాధి ● పాలు తాగిన వారందరిలో ఆందోళన

మెట్‌పల్లిరూరల్‌: వేంపేట గ్రామస్తులకు రేబిస్‌ వ్యాధి భయం పట్టుకుంది. గ్రామంలోని ఓ గేదైపె కొద్ది రోజుల క్రితం వీధి కుక్క దాడి చేసింది. దీంతో అనారోగ్యానికి గురైన గేదెను యజమాని పశు వైద్యాధికారులకు చూపించగా.. రేబిస్‌ వ్యాధి సోకినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. గేదె పాలను గ్రామంలోని ఓ పాల కేంద్రానికి సరఫరా చేశారు. పలువురికి ఇంటింటికి వెళ్లి అందజేశారు. దీంతో ఆ గేదె పాలు తీసుకున్న వారందరిలో ఆందోళన నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 20 మందికి పైగా రేబిస్‌ నివారణ టీకాలు వేశారు. ఈ విషయంపై మెట్‌పల్లి మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి క్రిములు ఏమైనా ఉంటే పాలను మరిగించే సమయంలో వేడి తీవ్రతకు చనిపోతాయని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా టీకాలు వేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement