పౌష్టికాహారంతోనే ఎదుగుదల
రాయికల్: పౌష్టికాహారంతోనే బాలికలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు హమంత్ అన్నారు. బుధవారం భూపతిపూర్ గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో 115 మంది బాలికలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. రక్తహీనతతో బాధపడుతున్న 70 మంది బాలికలకు నెలకు సరిపడా మందులు, శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. బాలికల ఆరోగ్యం, రక్తహీనత ఎలా వస్తుందన్న అంశాలపై ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ అచ్యుత్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాహితి అవగాహన కల్పించారు. సర్పంచ్ గుర్రం భావన, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఆర్‌ఎంపీ జక్కుల రాజేంద్రప్రసాద్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు బొల్లె చిన్నయ్య, ఉపాధ్యాయులు తాటిపల్లి వేణుగోపాల్, సురేశ్, శైలజ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు
జగిత్యాలటౌన్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణిపై జగిత్యాల నాయకులు ఫిర్యాదు చేశారు. బుధవారం హెదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలిసి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు, పార్టీ నిధుల దుర్వినియోగంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంపీ అరవింద్ అండదండలతో పార్టీని తన సొంత జాగీరుగా భావిస్తూ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను అవమానాలకు గురి చేస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అన్నారు. సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి, ఏసీఎస్ రాజు, చందా సుగుణాకర్, అక్కినపెల్లి రవీందర్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, ఆంకారి సుధాకర్, భగవంతరావు, శ్రీనివాస్, నవ్వోతు సురేశ్, బుర్ర ప్రమోద్, కూర్మాచలం సతీశ్, బిట్టు తదితరులున్నారు.
నవోదయతో
నాణ్యమైన విద్య
కోరుట్ల: కోరుట్లలో నవోదయ విద్యాలయం ఏర్పాటుతో ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పట్టణ శివారులోని సంగెం రోడ్డులో నవోదయ విద్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని బుధవారం పరిశీలించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రహదారులు, మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించేలా స్థలం ఎంపిక చేయాలన్నారు. స్థలంలో భూవివాదాలు లేకుండా చూడాలన్నారు. ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య, డిప్యూటీ తహసీల్దార్ ఫారూఖ్ తదితరులున్నారు.
గోడపై సంతకాలు
మెట్‌పల్లి: గోడ ఏంది.. దానిపై ఎకై ్సజ్ సిబ్బంది సంతకాలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా? అవును నిజమే. మెట్‌పల్లి ఎకై ్సజ్ కార్యాలయంలో హాజరు నమోదు రిజిస్టర్ అందుబాటులో లేక.. అందులో పని చేసే కొందరు సిబ్బంది అక్కడే ఉన్న గోడపై తమ పేరు రాసి సంతకాలు చేస్తున్నారు. విధులకు హాజరైనట్లు దానిపై చూపుతున్నారు. కార్యాలయంలో ఉండాల్సిన హాజరు రిజిస్టర్‌ను కొన్ని రోజుల క్రితం సీఐ తన వెంట తీసుకవెళ్లినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆయన కార్యాలయానికి రాకపోవడంతో సిబ్బంది ఇలా గోడపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. విధుల్లో చేరినప్పటి నుంచి సీఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
పౌష్టికాహారంతోనే ఎదుగుదల
పౌష్టికాహారంతోనే ఎదుగుదల


