తప్పటడుగులు... రక్తపుమడుగులు!
విచ్ఛిన్నమవుతున్న ‘బంధాలు’ దారితప్పుతున్న పోలీసులు కక్షలతో పోతున్న ప్రాణాలు జిల్లాలో వరుస ఘటనలతో ఆందోళన
‘ఈనెల 14న జగిత్యాలరూరల్ మండలం పొరండ్లకు చెందిన ఓ యువకుడు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ఆ కుటుంబంలో గొడవ జరిగింది. ఆ వివాహిత భర్తను వదిలిపెట్టి ప్రియుని కోసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు మహిళకు ప్రియుడిని అప్పగించారు. కోపోద్రిక్తుడై ఆమె భర్త ఈనెల 14న జగిత్యాలలోని బైపాస్‌రోడ్‌లో ఆ యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో భర్త జైలుకు వెళ్లగా, పిల్లలిద్దరూ అభాగ్యులుగా మారారు.’
జగిత్యాలక్రైం: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఉంటామని చేసే బాసనే పెళ్లి. అయితే ఇటీవల బంధాలు బలహీనమవుతున్నాయి. ఆకర్షణకు లోనై శాశ్వతమైన బంధాలను తెంపేసుకుంటున్నారు. క్షణికావేశంలో చే స్తున్న పనులకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు ఒంటరివారిగా మిగిలిపోతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి సక్రమార్గంలో నడిపించాల్సిన పోలీసులు సై తం విఫలమవుతున్నారనే చర్చ సాగుతోంది.
పోలీసుల తీరు వివాదాస్పదం
కుటుంబ తదాగాదాలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్న బాధితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలను చక్కదిద్దాల్సి ఉండగా.. పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో విడిపోతున్నారు. జిల్లా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సఖీ కేంద్రంతోపాటు భరోసా కేంద్రాలు ఉన్నా కలహాల కాపురాలుగానే మిగిలిపోతున్నాయి. ఠాణాలకు వచ్చిన వారిని కౌన్సెలింగ్ కోసం పోలీసులు ఈ కేంద్రాలకు పంపించడం లేదు.అయితే ఠాణాలను ఆశ్రయిస్తున్న వారిలో చాలా మంది కౌన్సెలింగ్‌కు ముందుకురావడం లేదని పలువురు పోలీసులు చెబుతున్నారు.
దూరమవుతున్న బంధాలు
జిల్లాలో చాలా కుటుంబాలు చిన్నచిన్న తదాగాలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరమవుతున్నారు. దీంతో వారే కాకుండా వారి పిల్లలు కూడా కుటుంబ తగాదాలతో మానసికంగా కుంగిపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేకపోవడంతో ఆ కుటుంబాలు తరచూ గొడవలతో విచ్ఛిన్నమవుతున్నాయి.
రోడ్లపైనే డంపు.. పట్టదా కంపు!
తప్పటడుగులు... రక్తపుమడుగులు!


