పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య

Mar 6 2026 9:07 AM | Updated on Mar 6 2026 9:07 AM

రామడుగు: పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య రామడుగులో సంచలనం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ(65)కు ఇద్దరు కుమారులు. పదిహేను రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి వచ్చిన పెద్ద కుమారుడు మహేశ్‌కు గ్రామానికి చెందిన అమ్మాయితో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బట్టలు తీసుకోనేందుకు మహేశ్‌ కరీంనగర్‌ వెళ్లాడు. మృతురాలి భర్త కొంరయ్య గ్రామంలోని ఓ పెళ్లికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న గౌరమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో మెడకోసి పరారయ్యారు. భర్త ఇంటికి వచ్చేసరికి భార్య రక్తపుమడుగులో పడిఉంది. చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమీప బంధువులే హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్‌కు తరలించారు. హత్యలో గౌరమ్మ చిన్నకుమారుడు అనిల్‌ను అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

గొంతుకోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు

సమీప బంధువుల పనేనని అనుమానం?

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement