కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాధ్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాధ్యం

Feb 21 2026 7:35 AM | Updated on Feb 21 2026 7:35 AM

కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాధ్యం

కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాధ్యం

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: పేద, మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకంతోనే పేదల సొంతింటి కల సాధ్యమవుతోందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం సారంగాపూర్‌ మండలం నాయకపుగూడెంలో సర్పంచ్‌ కొత్తూరి పుష్పనాథ్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కల నిజం చేయడం కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. మొదటి విడతలో ఇల్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, సీనియర్‌ నాయకుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రాజేశ్వరి, మాజీ ఉపసర్పంచ్‌ ఏలూరి గంగారెడ్డి, నాయకులు రవీందర్‌, గంగారెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement