మూడెకరాల్లో నష్టపోయా
వానాకాలం సీజన్‌లో మూడెకరాల్లో వరి సాగుచేసిన. పంట ఎదిగిందని సంతోషపడిన. మరికొద్ది రోజుల్లోనే కోయాలని అనుకున్నా. అంతలోనే భారీవర్షాలు కురిసి పంట నేలవాలింది. గింజలు రాలిపోయాయి. 80 శాతం వరి పంట నష్టపోయింది. ప్రభుత్వం రైతులకు పరిహారం త్వరగా ఇవ్వాలి.
– గడ్డం రాజేశ్వర్‌రెడ్డి, రైతు, భూషణరావుపేట
రైతులను ఆదుకోవాలి
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలి. వానకాలం సీజన్‌లో వరి పంటకు నష్టం జరిగితే నాలుగు నెలలు గడిచిన పరిహారం ఇవ్వకపోవడం దారుణం. నేతలు పరిహారం ఇప్పించడంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
– కిరణ్‌రావు, రైతు, తాండ్య్రాల
ప్రభుత్వ ఆదేశాలు రావాలి
అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా వరి పంటకు నష్టం జరిగినట్లు నివేదిక పంపించాం. వర్షాలు కురిసిన తర్వాత ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలు రూపొందించారు. పరిహారం విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. మంజూరు కాగానే రైతుల ఖాతాలో జమ చేస్తాం.
– యోగితా, మండల వ్యవసాయ అధికారి
మూడెకరాల్లో నష్టపోయా
మూడెకరాల్లో నష్టపోయా


