మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టి కృషి

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టి కృషి

మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టి కృషి

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: మత్తుపదార్థాల నిర్మూలన అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. మత్తుపదార్థాల రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి యువతను దారితప్పించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటిపై పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోపనిచేసి యువతను రక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని, సరిహద్దుల వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేస్తామని వివరించారు. అనుమానం వస్తే ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ ఆర్డీవోలు శ్రీనివాస్‌, మధుసూదన్‌, జీవాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద నివారణకు బ్లాక్‌స్పాట్ల గుర్తింపు

రోడ్డు ప్రమాద నివారణకు బ్లాక్‌స్పాట్లు గుర్తించామని కలెక్టర్‌ అన్నారు. రహదారి భద్రత కమిటీ, ఎస్పీతో కలిసి మాట్లాడారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్‌సిగ్నల్స్‌ పనిచేయడం లేదని, మరమ్మతు కోసం ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మంచినీళ్ల బావి సమీపంలో లైట్ల మరమ్మతు చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. గొల్లపల్లి బైపాస్‌రోడ్‌లో భవాని రోడ్‌ సమీపంలో గుంతలు పూడ్చాలన్నారు. ఎన్‌హెచ్‌63, ఎన్‌హెచ్‌563 రహదారులపై సైన్‌బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement